Sale
 ఆధునిక మహాభారతము.

ఆధునిక మహాభారతము.

Brand: VMRG International
Product Code: WM06
Availability: In Stock
₹400 ₹360

100 or more ₹360
Qty:  

నా దేశం నా ప్రజలు అనే
ఆధునిక మహాభారతము
(నా దేశం – నా ప్రజలు, మండే సూర్యుడు, గొర్రిల్లా, అరుస్తున్న ఆద్మీ, సముద్రం నా పేరు, నీరై పారిపోయింది, ప్రేమ లేఖలు, శేషజ్యోత్స్న).

***

ఆధునిక మహాభారతం 1970 – 1986 మధ్యకాలంలో ప్రచురించిన శేషేంద్ర వచన కవితా సంకలనాల సమాహారం. 1984లో అప్పటి వరకు వెలువడ్డ కవితా సంకలనాలను పర్వాలుగా రూపొందించారు. ఆంధ్రప్రభ వారపత్రికలో ఈ వివరణతో సహా ఆధునిక మహాభారతం ధారావాహికంగా వెలువడింది. 1984 – 86 వరకు ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో శేషేంద్ర జాలం శీర్షికన చిన్న కవితలు వెలువడ్డాయి. వీటికి 'అరుస్తున్న ఆద్మీ'గా పేరుపెట్టారు. ఆధునిక మహాభారతంలో 'ఆద్మీ పర్వం'గా చేర్చారు. శేషేంద్ర 'ఆధునిక మహాభారతం' వ్యాస విరచిత భారతానికి ఏ సంబంధం లేదు. శేషేంద్ర మాటల్లోనే ఆధునిక మహాభారతం అంటే నేటి మన భారతదేశం. ఫలితంగా శేషజ్యోత్స్న జ్యోత్స్నపర్వంగా, నా దేశం నా ప్రజలు ప్రజా పర్వంగా, మండే సూర్యుడు సూర్యపర్వంగా, గొరిల్లా పశు పర్వంగా, నీరై పారిపోయింది ప్రవాహాపర్వంగా, సముద్రం నా పేరు సముద్రపర్వంగా, ఇందులో రూపొందాయి.

అవతారిక

"ఇది నా కావ్య సంకలనం కాదు ఇది నా కావ్యం. నా సంపూర్ణ కావ్యం. కవి అనేక కావ్యాలు రాయడు. కవి ఒకే మనిషి – ప్రవహిస్తున్న ఒకే జీవితం జీవిస్తాడు; అలాగే ఒకే కావ్యం రాస్తాడు ... జీవితం ఒక యాత్ర; యాత్ర అనేక మజిలీల ప్రయాణం. దీని అర్థాంతరమే, కవి కావ్యయాత్ర అనేక కృతుల సాముదాయిక స్వరూపం. అంటే ఒక కవి తన జీవితంలో ఒకే కావ్యం రాస్తాడు, అయితే దాన్ని అప్పుడప్పుడూ క్రమక్రమంగా రాస్తూ ఉంటాడు. అలా రాయబడే ఒక్కో కృతి నిజంగా పూర్ణకృతి కోసం పుట్టే ఒక్కో పర్వం. కావ్యయాత్ర అంతిమ చరణంలో అన్ని పర్వాలూ కలిసి ఒక్క కావ్యం మాత్రమే అవుతుంది.
కనుక నేను నా జీవితంలో అనేక కావ్యాలు వ్రాయలేదు. రాశింది ఒకే కావ్యం. దాని పేరు నా దేశం నా ప్రజలు దాని వర్తమాన నామాంతరం ఆధునిక మహాభారతము. ఆ కావ్యం యొక్క భాగాలు నా జీవితంలో అప్పుడప్పుడూ రాస్తూవచ్చాను. భిన్నభిన్న నామకరణాలతో ఆ భాగాల్ని అప్పుడప్పుడూ ప్రకటిస్తూవచ్చాను. ఆ భిన్నభిన్న నామకరణాలతో అప్పుడప్పుడూ వచ్చిన ఆ భాగాలే ఈనాడు నా ప్రజలకు సమర్పిస్తున్న సంపూర్ణ కావ్యంలో పర్వాలుగా ప్రత్యక్షమవుతున్నాయి. అవి పుట్టినప్పుడు నిజంగా చివరకు రూపొందే సమగ్రకావ్యం కోసం పుట్టిన తొలి అవయవాలే గనుక ప్రతి పర్వాంతంలో ఒక పగ ఉంది. పర్వాంతగద్య. ఈ ఆధునిక మహాభారతానికి జనవంశమనే అనుబంధ కావ్యం ఒకటి ఉంది. ఇంతటితో నా కావ్యయాత్ర ముగిసింది "

- శేషేంద్ర

Write a review

Your Name:


Your Review: Note: HTML is not translated!

Rating: Bad           Good

Enter the code in the box below:





Special Gifting Books

Available for 100 Titles

Customer Service

 10.00 AM - 8.00 PM   |    Call (040) 65572593