శప్తభూమి రాయలసీమ చరిత్ర నేపథ్యంగా రాసిన నవల. రాయల కాల తదనంతరం సుమారు 18వ శతాబ్దం నాటి అనంతపుర సంస్థాన అధికార రాజకీయాలు. అప్పటి జీవితము చిత్రించిన చారిత్రాత్మక నవల. హండే రాజుల కాలంనాటి సంఘటనలు, కక్షలు, కార్పణ్యాల మధ్య నలిగిన ప్రజల జీవితాల, పాలెగాళ్ల దౌర్జన్యాల సమాహారం శప్తభూమి.

ఈ నవలలోని చారిత్రక పాత్రలను సమీక్షించుకుంటున్నప్పుడు ఎక్కువమంది అణగారిన వర్గాల వారే అయి ఫున్నారన్న సంగతి తెలిసివచ్చింది. వారు దళిత బహుజన కులాలవారే ఈ విషయం గుర్తించిన తర్వాత రాయలసీమ చారిత్రక నవల కాస్తా, రాయలసీమ దళిత బహుజన చారిత్రక నవలగా రూపం తీసుకోవడం ప్రారంభించింది. ఈ విధంగా, చారిత్రక కథ నుండి చారిత్రక నవలకూ, చారిత్రక నవల నుండి దళిత బహుజన చారిత్రక నవలకూ ప్రయాణించిన ఆలోచన క్రమం కూడా ఈ నవలా రచన వెనుక పనిచేసింది.

- బండి నారాయణస్వామి

Write a review

Your Name:


Your Review: Note: HTML is not translated!

Rating: Bad           Good

Enter the code in the box below:

Special Gifting Books

Available for 100 Titles

Customer Service

 10.00 AM - 8.00 PM   |    Call (040) 65572593