The First Leaf (Modern Haiku)

నాలో నేను(తెలుగు హైకు)

“ముసో” కలం పేరుతో టీవీ జర్నలిస్టు సోమయాజులు ముసునూరి రాసిన తెలుగు, ఇంగ్లిష్ హైకూల కాంబో ఎడిషన్ ఇది. 64 పేజీల పుస్తకంలో మొత్తం 254 హైకూలున్నాయి.

నాలుగు శతాబ్ధాల క్రితం జపాన్ లో ఊపిరిపోసుకున్న సూక్ష్మ కవిత్వ ప్రక్రియ “హైకు” ప్రపంచ సాహిత్యంలో తనదైన ముద్ర వేసింది. తెలుగులో సుమారు మూడు దశాబ్ధాల క్రితం కాలుమోపింది. నాటి ముత్యాలసరాలు, ద్విపదల దగ్గర్నుంచి నేటి నానీల దాకా రకరకాల రూపాంతరాల్లో  సజీవంగా ఉన్న సూక్ష్మ కవిత్వానికి ప్రేరణ హైకూ. హైకూలకు ఆద్యుడు బాషో (1644-1694). త్రిపదగా సాగే హైకూ 5 7 5 విభజనతో మొత్తం 17 మాత్రలుగా మూడు పాదాల్లో విస్తరించి ఉంటుంది. హైకూలో మొదటి రెండు పాదాలు రుతువునో, కాలాన్నో సూచించాలి. మూడో పాదంలో దృశ్యం లేదా అనుభూతితో కూడిన విరుపు ఉండాలి. తెలుగులో మూడు దశాబ్దాల క్రితమే హైకూలు ఊపిరిపోసుకున్నాయి. అయితే రకరకాలుగా రూపాంతరం చెందుతూ వచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మూడు వరుసలా పొట్టికవిత్వంలో ఎంతో లోతైన తాత్వికత ఉంటుంది.  పాఠకుడిని ప్రకృతితో తాదాత్మ్యత పొందగలిగేలా చేస్తుంది.

ఫుస్తకం చాలా చిన్నదే అయినా.. ఒక్కసారి చదివితే మనవెంటే నీడలాగా వెంటానే అనుభూతులనందించే హైకూలు చాలానే ఉన్నాయిందులో. అన్నీ పదచిత్రాలే. Poetry is a painting that speaks అన్నట్లు మనతో మాట్లాడుతున్నట్లే కనిపించే దృశ్యాలు ముసో హైకూలు.

Write a review

Your Name:


Your Review: Note: HTML is not translated!

Rating: Bad           Good

Enter the code in the box below:





Special Gifting Books

Available for 100 Titles

Customer Service

 10.00 AM - 8.00 PM   |    Call (040) 65572593