తెలుగులో కొత్త‌త‌రం అప‌రాధ ప‌రిశోధ‌న పుస్త‌కాల ట్రెండ్ మొద‌లైంది. ఈ పుస్త‌కం అందుకు పునాది వేసింద‌ని చెప్పాలి. ఇండియ‌న్ ఇన్వెస్టిగేష‌న్ ఫోర్స్ (ఐఐఎఫ్‌) చీఫ్ సీక్రెట్‌ ఏజెంట్ మాహు త‌న టీమ్‌తో క‌లిసి చేసిన సాహ‌సాలు, భార‌త‌దేశ భ‌ద్ర‌త‌కు సంబంధించిన ఒక కీల‌క‌మైన ద‌ర్యాప్తును విజ‌య‌వంతంగా పూర్తిచేసిన వీరోచిత‌ ఘట్టాల‌ను ఈ పుస్త‌కంలో చ‌ద‌వొచ్చు.

'ఆప‌రేష‌న్ ప‌హాడీమందిర్' 2017 ఆగ‌స్ట్ 20న ప్రారంభ‌మైంది. చీఫ్ ఏజెంట్ మాహు ఆగ‌స్ట్ 26 ఉద‌యం 7 గంట‌ల‌కి జార్ఖండ్ రాజ‌ధాని రాంచీలో అడుగుపెట్టాడు. అంత‌కు మూడు రోజుల క్రిత‌మే అత‌ని జూనియ‌ర్లు ఏజెంట్ చిత్ర‌, కంట్రోల్ మేనేజ‌ర్ దీప‌, ట్రెయినీ ఏజెంట్ సూర‌జ్ త‌మ‌కు అప్ప‌గించిన ఫ‌స్ట్‌హాండ్ లాగ్‌వ‌ర్క్‌ను పూర్తిచేశారు. రాత్రి 8 గంట‌ల‌కు చిత్తోర్‌పూర్ రావ‌డానికి ఇంకో ఎనిమిది కిలోమీట‌ర్ల ముందే ర‌ణ‌బాద్‌లో బ‌స్సు దిగిపోయాడు మాహు. ఆప‌రేష‌న్‌లో తొలి ప్రాణాంత‌క సాహ‌సాన్ని ర‌ణ‌బాద్‌లో పూర్తిచేసి, ఆరు శ‌వాల్ని న‌క్క‌ల‌కు ఆహారంగా అందించి చిత్తోర్‌పూర్ చేరిపోయాడు. అక్క‌డినుంచి త‌న పాత‌మిత్రుడు గులాటీతో క‌లిసి సంబ్లానా గ్రామం లోని మాజీ సైనికుడు, నూట అయిదేళ్ల వ‌య‌సున్న భీతావ‌ర్‌సింగ్ ఇంటికి చేరాడు.

కేసు గురించి …
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కి చెందిన మాజీ బందిపోటు ర‌యీజ్ ముస్త‌ఫా సంబ్లానా గ్రామానికి చెందిన మాజీ సైనికుడు భీతావ‌ర్‌సింగ్‌ను తీసుకుని ఇండియ‌న్ ఇన్వెస్టిగేటివ్ ఫోర్స్ (ఐఐఎఫ్‌) చీఫ్ నోమీఅంగ‌ద్‌ను క‌లిశారు. త‌మ గ్రామానికి స‌మీపాన వున్న వెలుగుల‌కొండ నుంచి అప్పుడ‌ప్పుడూ విష‌వాయువులు వెలువ‌డుతున్నాయ‌ని, వీటి కార‌ణంగా ఏటా ప‌దుల సంఖ్య‌లో మ‌నుషులు ప్రాణాలు కోల్పోతున్నార‌ని, ప్ర‌భుత్వం త‌మ స‌మ‌స్య‌ను సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేద‌ని వివ‌రించారు. ఐఐఎఫ్ జోక్యం చేసుకుని త‌మ స‌మ‌స్య‌కు ఒక ప‌రిష్కారం చూపించాల‌ని కోరారు. వెలుగుల‌కొండ నుంచి ఒక పేలుడులో బ‌య‌ట‌ప‌డ్డ శ‌క‌లం అంటూ ఒక లోహ‌పురాయిని నోమీకి అందిస్తాడు ర‌యీజ్‌. దానిని చూసి షాక్ తిన్న నోమీ ఈ కేసును ఇంకో కోణం నుంచి కూడా పరిశోధించాల్సిన అవ‌స‌రాన్ని గుర్తిస్తాడు. దేశ‌భ‌ద్ర‌త‌కు సంబంధించి ఈ రాయి కీల‌కం కాగ‌ల‌ద‌ని భావిస్తాడు. క‌ర్ణాట‌క బ‌ళ్లారి స‌మీపం లోని త‌న ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఐఐఎఫ్ చీఫ్ ఏజెంట్ మాహును త‌క్ష‌ణం ఢిల్లీకి ర‌ప్పించి ఆప‌రేష‌న్ ప‌హాడీమందిర్‌ను అత‌నికి అప్ప‌గిస్తాడు. మాహు బృందం ఈ ఆప‌రేష‌న్‌ను ఎలా విజ‌యవంతంగా పూర్తిచేసిందో ఈ పుస్త‌కంలో చ‌ద‌వండి.

Write a review

Your Name:


Your Review: Note: HTML is not translated!

Rating: Bad           Good

Enter the code in the box below:

Special Gifting Books

Available for 100 Titles

Customer Service

 10.00 AM - 8.00 PM   |    Call 91 + 6300483715