(బుద్ధుడు-బౌద్ధ‌ధ‌ర్మం పుస్త‌కాన్ని ప‌రిచ‌యం చేయ‌డానికి ... ఈ పుస్త‌కానికి బుద్ధ‌ఘోషుడు రాసిన ముందుమాటకు మించిన మార్గం లేదు. అందుకే ఆయ‌న ముందుమాట‌ను ఉన్న‌దున్న‌ట్లుగా ఈ పుస్త‌కానికి డిస్క్రిప్ష‌న్‌గా అందిస్తున్నాం. - సం.)


పొనుగోటి ప్రాథమికంగా పాత్రికేయుడు. పాత్రికేయుడుగా జగమెరిగినవాడు. రెండు విధాల - జగం ఆయన్ను ఎరిగింది. ఆయన జగాన్ని ఎరిగాడు. పత్రికా రచయితగా రాణించాలంటే భాషమీద, వాక్యంమీద పట్టు ఉండాలి. ఆ పట్టు కృష్ణారెడ్డికి పుష్కలంగా ఉంది. కనుకనే ఆ రంగంలో రాణించాడు. ఆ రాణకెక్కడమే ఆయన్ను ఒక సాహసానికి పురికొల్పింది.

అదేమంటే : బుద్ధుడికి బోధి (జుఅశ్రీఱస్త్రష్ట్ర్‌వఅఎవఅ్‌) కలిగాక, దానిలోని గహనత, గాఢత చూసి దీనిని ప్రపంచం అర్థం చేసుకోలేదు. ప్రపంచం కన్నులు దుమ్ముతో నిండి వున్నాయి. నేను దీనిని ప్రపంచానికి వివరించాలనుకోవడం వెర్రితనం. వారికి అర్థం కాదు సరికదా నాకు చివరకు మిగిలేది ఆయాసమే. అందుకని దీనిని ప్రపంచానికి చెప్పకుండడమే ఉత్తమమని భావించాడు. కాని తనతో ఈ జ్ఞానం అంతరించడం ఇష్టంలేక అక్కడ నుంచి సారనాథ్‌కు పయనించి, తాను తపస్సులో ఉన్నప్పుడు, తనకు శుశ్రూష చేసిన ఐదుగురు సన్యాసులకు మొదటగా తాను కనుగొన్న నూతన జ్ఞానాన్ని వివరించాడు. కళ్ళల్లో దుమ్ములేనివారు  మొదటగా దానిని అర్థం చేసుకొన్నారు. అందుకే టశీశీశ్రీర ష్ట్రaఙవ అశీ జూశ్రీaషవ ఱఅ దీబససష్ట్రఱరఎ అన్నాడు ఒక మహాశయుడు.

అలా నా దృష్టిలో కళ్ళల్లో దుమ్ములేని వారిలో కృష్ణారెడ్డి గూడా ఒకరు. కళ్ళల్లో దుమ్ము లేకపోవడంవల్లనే తెలుగు ప్రపంచానికి, ఆ బౌద్ధాన్ని, ఆ బాలగోపాలానికి - పండితునికి, పామరునికి, పిల్లల నుంచి పెద్దలదాకా అర్థం అయ్యేలా తన పాత్రికేయానుభవాన్ని రంగరించి, చందమామ కథా చిత్రణా శైలిలో  అందించే సాహసం చేశాడు. ఆ చేయి తిరిగినవాని సాహసం, కృషి వట్టిపోవు గదా.

ఇంతవరకు నే చెప్పిన దానిలో ఇసుమంతయు అతిశయోక్తి లేదని తెలుసుకోవ డానికి, కృష్ణారెడ్డి రాసిన 'బుద్ధుడు - బౌద్ధ ధర్మం' అనే గ్రంథాన్ని చదవమంటాను. బౌద్ధ చింతనా ప్రక్రియ చాలా సంక్లిష్టం. ఈ సంక్లిష్టత మరి ఏ మతంలోనూ లేదని  చెబుతాను. మనో వైజ్ఞానిక (ూరవషష్ట్రశీశ్రీశీస్త్రవ) విషయాలలో, ఇంతవరకు బుద్ధుడు చేరిన

శిఖరాలకు చేరిన శాస్త్రవేత్త లేడు. ఆయన చెప్పిన దానిలో ఎన్నో పారిభాషిక - సాంకేతిక పదాలు ఉండి, తెలుసుకోగోరిన వారికి చెమటలు పట్టిస్తాయి. కాని కృష్ణారెడ్డి, ఆ జటిలత జోలికి తిన్నగా పోకుండా ఆ జటిలత వెనుక దాగి ఉన్న అసలు అర్థాన్ని వదిలిపెట్టకుండా సరళ భాషలో, అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా ఈ గ్రంథాన్ని రాశాడు. నేను ఎన్నో బౌద్ధ గ్రంథాలు తెలుగులో రాశాను, తెలుగులోకి అనువదించాను. కాని అవి అన్నీ అధికారిక గ్రంథాలే అయినా, పండిత భాషలో ఉండి పామరులకు చేరువ కాలేకపోయాయి. కృష్ణారెడ్డి భాష సరళం, వాక్యం పరుగులు తీస్తుంది. అన్వయం కోసం వాక్యాన్ని మరోసారి చదవవలసిన అవసరం ఎప్పుడూ, ఎక్కడా రాదు. అదొక అనితర సాధ్యమైన శైలి.

పోతే ఈ గ్రంథంలో థేరవాద బౌద్ధానికి సంబంధించి కృష్ణారెడ్డి తడమని అంశంలేదు. కొన్నిచోట్ల మహాయానమూ చెప్పాడు. ఇందులో బుద్ధుని జననం నుంచి నిర్వాణం వరకు ముఖ్యాంశాలన్నింటిని ఒక ఎడతెగని ధారగా  కూర్చాడు.

బుద్ధుని ముఖ్య బోధనలు శీర్షిక క్రింద బౌద్ధం మొత్తాన్ని చెప్పివేశాడు. బుద్ధుని వర్ణ వ్యవస్థ నిరాకరణను, హిందూ కర్మ సిద్ధాంతానికి, బౌద్ధ కర్మ సిద్ధాంతానికి తేడాను, బౌద్ధంలో దేవుని స్థానంలో 'నీతి' ఆక్రమించడం, దేవుని అనావశ్యకతను, - దశపార మితలు, విపశ్యనాధ్యానం, బౌద్ధమతవ్యాప్తి, హిందూమతానికి దేవుడు కేంద్రమైతే, బౌద్ధానికి ఎలా మనిషి కేంద్రమైందీ, స్త్రీలకు బుద్ధుడు కల్పించిన స్థానాన్ని గురించీ గ్రంథంలో చర్చించాడు.

తెలుగులో ఇప్పుడిప్పుడే బౌద్ధ వ్యాప్తి ఊపందుకొంటోంది. తెలుగులో గ్రంథాలు విరివిగా వస్తున్నాయి. ఇది బౌద్ధానికి శుభసూచకం. ఈ బౌద్ధ సాహితీ వికాస ప్రక్రియా మహా యజ్ఞంలో మిత్రుడు పొనుగోటి ఈ గ్రంథాన్ని సమిధగా అర్పించడం హర్షించ దగినది. ఈ గ్రంథం బౌద్ధ సాహిత్యంలో అధికారిక గ్రంథంగా నిలబడి, ఆ బాలగోపాలాన్ని అలరిస్తుందని ఆశిస్తూ, ఈ కృషిచేసిన కృష్ణారెడ్డిని అభినందిస్తూ...

-బుద్ధఘోషుడు
26-11-2013   

Write a review

Your Name:


Your Review: Note: HTML is not translated!

Rating: Bad           Good

Enter the code in the box below:

Special Gifting Books

Available for 100 Titles

Customer Service

 10.00 AM - 8.00 PM   |    Call 91 + 6300483715