Sale
Padava taragathi

Padava taragathi

Product Code: PTT
Availability: Out Of Stock
₹180 ₹150
Qty:  

Author : Suresh Veluguri 
 

పదవ తరగతి పాసైన విద్యార్ధుల భవిష్యత్‌ గురించి వారికి, వారి తల్లిదండ్రులకు సహజంగానే తీవ్రమైన ఆందోళన వుంటుంది. జీవితకాలంపాటు తమను పోషించే ఒక బలమైన కెరియర్‌ను నిర్మించుకోవడానికి తొలి పునాది ఇక్కడే పడుతుంది.

టెంత్‌ తర్వాత ఏం చేయాలి, ఎటువంటి కోర్సులను ఎంచుకుంటే భవిష్యత్‌ బావుంటుంది, ఏ రంగం ఎంచుకుంటే జీవితంలో స్థిరపడడానికి ఎక్కువ అవకాశాలుంటాయి మొదలైన అనేక గందరగోళాలు వారిని చుట్టుముట్టివుంటాయి. దురదృష్టవశాత్తూ మనకు తొలినుంచీ కెరియర్‌ రంగాల గురించిన సమాచార లోపం వుంటూనే వుంది. ఈ లోపాన్ని అధిగమించడం ద్వారా ఏటా టెంత్‌ పాసై బయటకు వస్తున్న ఎనిమిది లక్షల మందికి పైగా విద్యార్థులకు పెద్దస్థాయిలో ప్రయోజనం కల్పించడం కోసం 1999లో ‘పదవ తరగతి తరువాత..?’ పేరుతో ఒక సమగ్రమైన కెరియర్‌ గైడెన్స్‌ పుస్తకాన్ని విఎమ్‌ఆర్‌జి ఇంటర్నేషనల్‌ ప్రచురించింది. ఏటా ఈ సమాచారాన్ని మరింత సమగ్రం చేస్తూ ప్రస్తుతం 20వ ఎడిషన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

పదవ తరగతి పూర్తిచేసి బయటకువస్తున్న విద్యార్థులకు ఈ పుస్తకం కల్పతరువులా ఉపయోగపడుతుంది. టెంత్‌ తర్వాత ఎంచుకోదగ్గ ఇంటర్మీడియట్‌, పాలిటెక్నిక్‌ల వంటి సంప్రదాయిక కోర్సులతో పాటు సాంకేతిక కోర్సులు, అనేక ఇతర కోర్సుల వివరాలను ఈ పుస్తకంలో సమగ్రంగా పొందుపరచడం జరిగింది. వీటితోపాటు టెంత్‌ ఫెయిలైనవారికి ఉపయోగపడే కోర్సుల వివరాలు కూడా జతచేయబడ్డాయి. అలాగే, చదువుకోవాలనే ఆసక్తి వుండీ, ఆర్థిక స్థోమత లేనివారికి సాయం చేసే సంస్థల సమాచారం కూడా జోడించడం జరిగింది. దీంతోపాటు విద్యార్థుల మీద ఈ దశలో ప్రభావం చూపే పలు మానసిక పరమైన అంశాలు, తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా వ్యాసాలున్నాయి.

కెరియర్‌, రాజకీయాలు, నాయకత్వ శిక్షణకు సంబంధించి 45 పుస్తకాలు రచించిన ప్రముఖ లీడర్‌షిప్‌ మేనేజర్‌ సురేశ్‌ వెలుగూరి ఈ పుస్తకాన్ని రూపొందించారు. ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా వుండాల్సిన పుస్తకమిది.

Write a review

Your Name:


Your Review: Note: HTML is not translated!

Rating: Bad           Good

Enter the code in the box below:





Special Gifting Books

Available for 100 Titles

Customer Service

 10.00 AM - 8.00 PM   |    Call (040) 65572593