Sale
ఉద్యోగం కోసం

ఉద్యోగం కోసం

Product Code: UDYO
Availability: Out Of Stock
₹160 ₹130
Qty:  

చ‌దువులు పూర్తిచేసుకుని ఉద్యోగాల కోసం ప్ర‌య‌త్నాలు ప్రారంభించారా? అయితే ఈ పుస్త‌కం మీరు త‌ప్ప‌క చ‌ద‌వాలి.  మీ సామ‌ర్థ్యాల‌ను పెట్టుబ‌డి పెట్టి ఏదో ఒక‌ ఉద్యోగం సంపాదించ‌డం ఈరోజున్న కాల‌మాన ప‌రిస్థితుల్లో పెద్ద క‌ష్ట‌మైన విష‌యం కాదు. కానీ మీ మ‌న‌సుకు న‌చ్చిన ఉద్యోగం సంపాదించ‌డం; మీ భ‌విష్య‌త్తుకు బ‌లాన్నిచ్చే ఉద్యోగం సంపాదించ‌డం మాత్రం క‌ష్ట‌మైన విష‌య‌మే! అయితేనేం, దానిని సంపాదించ‌డానికి ఉద్యోగార్థులు (Career Seekers) ఎప్పుడూ సిద్ధంగానే వుంటారు. త‌మ శ‌క్తిసామ‌ర్థ్యాల‌ను, శ్ర‌మ‌ను పెట్టుబ‌డి పెడుతూ జీవితంలో ఎద‌గాల‌ని నూరుశాతం కృషి చేస్తారు. అటువంటివారికి స‌రైన దిశానిర్దేశం చేసే ఏకైక తెలుగు పుస్త‌క‌మిది.

 

ఉద్యోగాలు సాధించుకోవ‌డానికి ఈరోజున్న‌న్ని అవ‌కాశాలు గ‌తంలో లేవు. అలాగే, ఈరోజు అవ‌స‌ర‌మ‌వుతున్న‌న్ని నైపుణ్యాలూ గతంలో లేవు. టెక్నాల‌జీ శ‌ర‌వేగంగా దూసుకుపోతున్న ఈ స‌మయంలో కంపెనీలు త‌మ ఉద్యోగుల‌కు విష‌య ప‌రిజ్ఞానంతో పాటు అనేక అద‌న‌పు అర్హ‌తలూ వుండాల‌ని కోరుకుంటున్నాయి. త‌మ ఉత్ప‌త్తుల‌ను వేగంగా, నాణ్యంగా మార్కెట్లోకి తీసుకువెళ్ల‌డానికి కంపెనీలు ఎన్నో అవ‌కాశాల్ని సృష్టిస్తున్నాయి. ఈ అన్ని అవ‌కాశాలూ మ‌రిన్ని కొత్త ఉద్యోగాల‌ను సృష్టిస్తున్నాయి. కానీ, వీటిని అందిపుచ్చుకోవ‌డానికి ఉద్యోగార్థుల‌కు వుండాల్సిన నైపుణ్యాల గురించి మాత్రం తెలుగులో ఎక్క‌డా స‌రైన స‌మాచారం అందుబాటులో లేదు. ఈ పుస్త‌కం ఆ అవ‌స‌రాల్ని ఖ‌చ్చితంగా తీరుస్తుంది.

 

మొత్తం 12 అధ్యాయాలున్న ఈ పుస్త‌కంలో ఉద్యోగార్థుల‌కు వుండాల్సిన ల‌క్ష‌ణాలు, నైపుణ్యాలు, ప‌రిస్థితుల‌కు త‌గిన‌ట్లు ప్ర‌వ‌ర్తించే గుణాలు, త‌మ‌ను తాము ఉద్యోగానికి సిద్ధం చేసుకోవ‌డం, టెక్నాల‌జీని అనుసంధానించుకోవ‌డం, త‌మ‌ను తాము ఒక బిజినెస్ ప్రాడ‌క్ట్‌గా తీర్చిదిద్దుకోవ‌డం, రెజ్యూమెలు సిద్ధం చేసుకోవ‌డం, ఇంట‌ర్‌వ్యూల‌కు సిద్ధం కావ‌డం, ఇంట‌ర్‌వ్యూల‌కు హాజ‌రు కావ‌డం, స‌రైన విధంగా ఇంట‌ర్‌వ్యూను పూర్తి చేసి ఉద్యోగం సాధించుకోవ‌డం వ‌ర‌కూ వంద‌లాది అంశాల‌పై స‌వివ‌ర‌మైన స‌మాచారాన్ని ఈ పుస్త‌కంలో పొందుప‌రిచారు. ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నించే ప్ర‌తి ఒక్క‌రివ‌ద్దా త‌ప్ప‌క వుండితీరాల్సిన పుస్త‌కంగా దీనిని తీర్చిదిద్దారు.

 

ఈ పుస్త‌కం గురించి కొంద‌రు సీనియ‌ర్ మేనేజ‌ర్ల అభిప్రాయాలివి.

 

ఉద్యోగం సాధించాలంటే దానికి అక‌డ‌మిక్ అర్హ‌త‌లుంటే చాలు అనే అభిప్రాయం ఎక్కువ శాతం ఉద్యోగార్థుల్లో వుంటుంది. కానీ, ఈరోజున్న ప‌రిస్థితుల్లో విద్యార్హ‌త‌లు మాత్ర‌మే స‌రిపోవు. ఇంకా అనేక విష‌యాలు తెలిసివుండాలి; తెలియ‌డ‌మే కాదు, వాటి మీద ప‌ట్టు కూడా వుండితీరాలి. ఈ విష‌యాల గురించి ఉద్యోగార్థుల‌కు కాలేజీల్లో, యూనివ‌ర్సిటీల్లో ఎక్క‌డా స‌మాచారం ల‌భించ‌దు. విఎమ్ఆర్‌జి ఇంట‌ర్నేష‌న‌ల్ ఇలాంటి ల‌క్ష‌లాది మంది యువ‌తీ యువ‌కుల‌కు ఈ పుస్త‌కం విడుద‌ల చేయ‌డం ద్వారా ఎంతో సాయం చేసింది. ఈ పుస్త‌కం నుంచి తీసుకున్న స‌మాచారంతో ఎవ‌రైనా సుల‌భంగా ఉద్యోగం సాధించుకోవ‌చ్చంటే ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. సుప్ర‌సిద్ధ ర‌చ‌యిత‌, వ‌ర్క్‌ప్లేస్ మేనేజ్‌మెంట్ నిపుణులు సురేశ్ వెలుగూరి త‌న ఇత‌ర పుస్త‌కాల్లాగే దీనికి కూడా చాలా ఆర్ & డి చేశారు. ఆయ‌న కృషి పుస్త‌కం లోని ప్ర‌తి పేజీలోనూ క‌నిపిస్తుంది. ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌వారంతా చ‌దివితీరాల్సిన పుస్త‌క‌మిది.

 

– ఎన్‌.వి. రంజ‌న్ కుమార్‌, సాఫ్ట్‌హాలిక్స్ ఇంట‌ర్నేష‌న‌ల్‌, హైద‌రాబాద్‌.

 

ఇలాంటి పుస్త‌కం ఒక‌టి తెలుగులో వుందంటేనే ఆశ్చ‌ర్యంగా వుంది. ఒక పాఠ‌కుడిగా హైద‌రాబాద్ బుక్‌ఫెయిర్‌లో విఎమ్ఆర్‌జి బుక్‌స్టాల్‌లో ర‌చ‌యిత సురేశ్ వెలుగూరి రాసిన వ‌ర్క్‌ప్లేస్ మేనేజ్‌మెంట్‌, స్టార్ట‌ప్ మేనేజ్‌మెంట్ పుస్త‌కాల‌ను కొనుక్కున్నాను. తాజాగా ఆయ‌న నుంచి నాకందిన ఈ రిఫ‌రెన్స్ పుస్త‌కం టైటిల్ చూడ‌గానే లోప‌లి విష‌యం అర్థ‌మైపోయింది. చాలా లోతైన ప‌రిశోధ‌న చేసి, ఉద్యోగాల కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌వారికి బ‌ల‌మైన స‌మాచారాన్ని అందించారు. విద్యార్హ‌త‌ల‌తో పాటు ఉద్యోగార్థుల‌కు వుండాల్సిన ప‌లు అద‌న‌పు అర్హ‌త‌ల గురించి చాలా విలువైన స‌మాచారాన్ని ప్రాక్టిక‌ల్ ఉదాహ‌ర‌ణ‌ల‌తో పాటు అందించారు. ర‌చ‌యిత ఈ పుస్త‌కంలో కూడా చాలా స‌ర‌ళ‌మైన భాష‌ను ఉప‌యోగించి, తెలుగు పాఠ‌కులంద‌రికీ సుల‌భంగా అర్థ‌మ‌య్యేలా ప్ర‌య‌త్నించారు. నేను రిక‌మెండ్ చేస్తున్నాను. నిస్సందేహంగా ఉద్యోగ ప్ర‌య‌త్నాల్లో వున్న‌వారంద‌రికీ ఈ పుస్త‌కం కీల‌కంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

 

– వెల‌నాటి సూర్య‌నారాయ‌ణ‌, సాఫ్ట్‌స్కిల్స్ నిపుణులు

 

Write a review

Your Name:


Your Review: Note: HTML is not translated!

Rating: Bad           Good

Enter the code in the box below:

Special Gifting Books

Available for 100 Titles

Customer Service

 10.00 AM - 8.00 PM   |    Call 91 + 6300483715